సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ చిత్రం విడుదల అంటే తప్పకుండా ఒక్కసారైనా చూడాలని అని ప్రతి సినీ అభిమాని అనుకుంటారు. ఎందుకంటే ఆయన నటన అంత అద్భుతంగా ఉంటుంది కనుక. 2018 వచ్చిన విశ్వరూపం 2 అంతా పెద్ద విజయాన్ని అందుకోలేదు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్ హాసన్ గారు రాజకీయాలపై దృష్టి పెట్టారు కనుక తన సమయాన్ని సినిమాలకు కేటాయించలేకపోయారు. కమల్ హాసన్ గారి 232 వ ప్రాజెక్ట్ ఈ రోజు పోస్టర్ తో ప్రకటించబడింది. దీనికి ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తుంది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్, దేర్ లైవ్ ఎ గోస్ట్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌తో మేకర్స్ ఈ రోజు విడుదల చేసారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అనిరుధ్ సంగీతం మరియు నేపథ్య స్కోర్ కంపోజ్ చేయనున్నారు. ఈ చిత్రం సమ్మర్ 2021 విడుదల చేయాలని ఈ చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్టర్ చిత్రం పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది అని తెలుస్తోంది.
Another journey begins.
மறுபடியும் உங்கள் நான்.@RKFI @Dir_Lokesh @anirudhofficial pic.twitter.com/ABMwrb45Qa
— Kamal Haasan (@ikamalhaasan) September 16, 2020