మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో విడుదల కానున్న
గని మూవీ విడుదల తేదీ మారబోతున్నాట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ‘గని’ మూవీని ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉంది కానీ ఇదే తేదీన బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ విడుదల ఉండటంతో గని చిత్రాన్ని మరికొంత ముందుకి వెళ్ళాలని బావిస్తున్నారు అని తెలుస్తోంది. ఇఫ్పటికే విడుదలైన టీజర్, స్పెషల్ సాంగ్ కు మంచి రెస్సాన్సే వచ్చింది. దీంతో మేకర్స్ మార్చి 4న కానీ ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తోంది. చూడాలి త్వరలోనే మరో విడుదల తేదీ అప్డేట్ రానుంది.