మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. యూ ఎస్ లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ సోషల్ మీడియాలో #khiladi యాష్ టాగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం పై బిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫస్ట్ హాఫ్ యావరేజ్ టాక్ అని సెకండ్ హాఫ్ ఫుల్ కిక్క ఇచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఈ రోజు ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. రన్ టైమ్ 154 నిమిషాలు ( 2గంటల 34 నిమిషాలు) ఉంది.