పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న మూడవ చిత్రం టైటిల్ గురించి మెగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేసారు చిత్ర బృందం. ‘ఉప్పెన’ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైష్ణవ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అలా ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ సినిమా చేశారు. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన చిత్ర బృందం. ఈ చిత్రం నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.