Site icon syeraa

కమల్ హాసన్ కొత్త చిత్రం ఖైదీ, మాస్టర్ దర్శకుడుతో

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ చిత్రం విడుదల అంటే తప్పకుండా ఒక్కసారైనా చూడాలని అని ప్రతి సినీ అభిమాని అనుకుంటారు. ఎందుకంటే ఆయన నటన అంత అద్భుతంగా ఉంటుంది కనుక. 2018 వచ్చిన విశ్వరూపం 2 అంతా పెద్ద విజయాన్ని అందుకోలేదు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్ హాసన్ గారు రాజకీయాలపై దృష్టి పెట్టారు కనుక తన సమయాన్ని సినిమాలకు కేటాయించలేకపోయారు. కమల్ హాసన్ గారి 232 వ ప్రాజెక్ట్ ఈ రోజు పోస్టర్ తో ప్రకటించబడింది. దీనికి ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తుంది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్, దేర్ లైవ్ ఎ గోస్ట్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌తో మేకర్స్ ఈ రోజు విడుదల చేసారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అనిరుధ్ సంగీతం మరియు నేపథ్య స్కోర్ కంపోజ్ చేయనున్నారు. ఈ చిత్రం సమ్మర్ 2021 విడుదల చేయాలని ఈ చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్టర్ చిత్రం పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది అని తెలుస్తోంది.

Exit mobile version