సుడిగాలి సుధీర్ గా బుల్లి తెర మీద వినోదాన్ని అందిస్తూన్న జబర్ధస్త్ సుధీర్ ఇప్పుడు మరో సారీ పెద్ద తెర మీద హీరోగా కనిపించబోతున్నారు. సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్ అంతగా ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేదు. ఇప్పుడు సుధీర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అధ్బుతంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.