ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్ మూడో సినిమా ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలకు సంబందించిన ప్రోమో సాంగ్ వచ్చేసింది. పుల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దక్కో మేక, శ్రీవల్లి రెండూ కూడా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు సామి సామి వచ్చేస్తుంది. మాస్ బీట్స్ తో ఈ పూర్తి పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాలుగా రానుంది.