నటి తేజస్వి మదివాడ ప్రధాన కధానాయిక పాత్రలో రాబోయే చిత్రం కమిట్మెంట్ టీజర్ ఈ ఉదయం విడుదల చేసారు ఈ చిత్ర బృందం. ఈ చిత్రం కథ చిత్ర పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి లాగా ఉంది. ఈ టీజర్‌లో తేజస్వి పలికిన పలు బలమైన డైలాగ్స్ ఉన్నాయి. అలాగే, ఉద్వేగభరితమైన లిప్-లాక్స్ కూడా ఉన్నాయి ఈ టీజర్లో. రమ్య పసుపులేటి, అన్వేషి జైన్, అమిత్ తివారీ, శ్రీనాథ్ మగంతి వంటి నటి నటులు నటించారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. బల్దేవ్ సింగ్ మరియు నీలిమా టి. నరేష్ కుమారన్ సంయుక్తంగా నిర్మించారు.