క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. మన తెలుగు లో ఒక్క టాప్ వెబ్ సైట్ కూడా 3.25 రేటింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి లో కూడా దూసుకుపోతుంది. అలాగే హిట్ టాక్ తెచ్చుకున్న పాన్ ఇండియన్ చిత్రం శ్యామ్ సింఘా రాయ్ రేటింగ్ పరంగా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే పుష్ప దూసుకుపోతుంది. పుష్ప చిత్రం విడుదలైన కొత్తలో ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో కె జి ఎఫ్ తో పోల్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఓటిటి లో చూసిన ప్రేక్షకులు దానికి దీనికి ఏ సంబంధం లేదని తెలియజేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి విభిన్న పాత్రల్లో స్టైలిష్ ని పక్కన పెట్టి ఐకాన్ స్టార్ గా తన అద్భుత నటనతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలను అందుకుంటున్నారు. ఈ చిత్రం కొద్దిగా తమిళ్ నేటివిటీకి అనుగుణంగా ఉండటం అక్కడ ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగా అభిమానించారో అక్కడ వస్తున్న కలెక్షన్స్ తెలుస్తున్నాయి. కథల పరంగా ఈసారి మన దర్శకులు కొత్తగా ఆలోచిస్తూ హీరోల గెట్అప్ లో మార్పులు తీసుకువస్తున్నారు. మన తెలుగు సినిమాలు యావత్ ప్రపంచం గుర్తించుకునేల తీస్తున్నారు. వారు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా సగటు ప్రేక్షకుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ పుష్ప విషయంలో మాత్రం మన తెలుగు టాప్ సమీక్షకులను ఏ విధంగా వారి అంచనాలను అందుకోలేక పోయింది తెలియడం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఓటిటి
లో చూసిన తరవాత తమ అభిప్రాయం తెలియజేస్తూ అల్లు అర్జున్ కు సుకుమార్ కి శుభాకాంక్షలు తెలుస్తూ అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ కొనియాడుతున్నారు.
గమినిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే !