తాప్సీ పన్నూ తన సినిమాల్లో పవర్‌హౌస్ నటనతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. బాలీవుడ్ మూవీస్ లో ‘పింక్’, ‘నామ్ షబానా’, ‘ముల్క్’, ‘బద్లా’ మరియు ‘గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఈ రోజు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా, తన తదుపరి చిత్రం ప్రకటించింది.
తన తదుపరి చిత్రం ‘షాబాష్ మిథు’ లో క్రికెటర్ మితాలి పాత్రను చేస్తున్నాని ప్రకటించింది. కవర్ డ్రైవ్ నేర్చుకోవడానికి ఆమె అంతా సిద్ధంగా ఉన్నాను అని ఆమె పేర్కొన్నారు. ” హ్యాపీ హ్యాపీ బర్త్ డే కెప్టెన్ మిథాలిరాజ్! మీరు మమ్మలిని మీ ఆటతో అలరించారు. మిథాలీ క్యారెక్టర్ తెరపై నేను ప్రదర్శించడానికి ఎన్నుకోబడటం నిజంగా గౌరవం వుంది అని తాప్సి అన్నారు . మీ ఈ పుట్టినరోజున నేను మీకు ఏ బహుమతి ఇవ్వగలానో తెలియదు కాని నేనుషాబాష్ మిథు లో మీ పాత్రలో మంచిగా నటించి మీకు గిఫ్టుగా ఇవ్వగలను అని తాప్సి అన్నారు.
ఈ మూవీని రాయిస్ డైరెక్ట్ చేయబోతున్నారు వైయాకామ్18స్టూడియో వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.