లాక్ డౌన్ సమయంలో ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరు చెప్పే ఒకే ఒక వ్యక్తి పేరు సోను సూద్. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటులలో ఒకరైన నటుడు సోను సూద్ తాను చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని నిరూపించాడు. ఈ కరోనావైరస్ మహమ్మారి సమయంలో తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి కష్టపడుతున్న లక్షలాది మంది వలస కార్మికులకు ఆయన సహాయకారిగా నిలిచారు. ఈ కరోనావైరస్ సమయంలో ఆయన చేసిన అసాధారణమైన కృషికి, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) ప్రతిష్టాత్మక ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రదానం చేస్తుంది. అతను సమాజానికి చేసిన సేవకు ఇలాంటి గౌరవాలు పొందిన ఏంజెలీనా జోలీ, డేవిడ్ బెక్హాం మరియు లియోనార్డో డికాప్రియోల లిస్టులో సోనూ సూద్ చేరాడు. మన దేశంలో చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా సోను సూద్ అందిస్తున్నారు. వర్చువల్ వేడుకలో సోను సూద్ ఈ అవార్డును అందుకున్నారు. సోను సూద్ తనకి ఇచ్చిన గౌరవానికి యుఎన్‌డిపికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సెట్స్‌లో సోను సూద్ ఇటీవల చేరారు. అల్లుడు అదుర్స్ టీమ్ ఆయన సెట్స్ లోకి రాగానే చప్పట్లు తో స్వాగతం పలికి సాళువ కప్పి సన్మానించారు.
సోను సూద్ వివిధ బ్రాండ్లను ఆమోదించడంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు అలాగే హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో అనేక ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు.