టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది అలాగే మనకు నాని కొత్తగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే వాసు క్యారెక్టర్ కృతిశెట్టితో లవ్ స్టోరీ చాలా బాగుంది. కృతి శెట్టి నటన న్యాచురల్ గా అనిపించింది. మడోన్నా సెబాస్టియన్ పాత్ర కూడా బాగుంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఇందులో ప్రేక్షకులను కట్టిపడేసేలా తగినంత అంశాలు ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో నాని ద్వి పాత్రలో మెప్పించాడు. మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ మంచి కథాంశంతో కూడిన యాక్షన్ డ్రామా చిత్రంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా అయితే మాత్రం ఉంది.