మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలతో కొద్ది రోజుల క్రితం కెసిఆర్‌ను కలుసుకుని, తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ కోసం లాక్డౌన్ నుంచి మినహాయింపు గురించి మాట్లాడారు.
దీనికి ప్రభుత్వం అనుమతి కోసం కొద్దిగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేసిన తరువాత అనుమతులు మంజూరు చేస్తాం అని చెప్పడం జరిగింది, అయితే ఈ రోజు కెసిఆర్ షూటింగ్ లకు అనుమతులు ఇస్తూ ఫైలుపై సంతకం చేశారు, కనీస తక్కువ మందితో తెలంగాణలో షూటింగ్స్ నిర్వహించడానికి అధికారికంగా అనుమతి ఇవ్వడం జరిగింది.కానీ సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి అనుమతి లేదని ఆయన స్పష్టంగా చేశారు. రాబోయే రోజుల్లో థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని కెసిఆర్ తన నోట్‌లో పేర్కొన్నారు.
చిరంజీవి అలాగే సిని ప్రముఖులు షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో సిఎం కెసిఆర్ గార్కి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020
కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. #Telangana #KCR #Tollywood #TFI pic.twitter.com/CKU9x4x0Tw
— BARaju (@baraju_SuperHit) June 8, 2020
వేతనాలు లేక ఎంతోమంది సినీకార్మికులు కష్టాన్ని అనుభవిస్తుండగా
సినిమా షూటింగ్స్ జరగడానికి పర్మిషన్ ఇచ్చిన ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ కు సినీకార్మికుల తరుపున నా కృతజ్ఞతలు – నాగబాబు— Naga Babu Konidela (@NagaBabuOffl) June 8, 2020