ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది.
రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్న సినిమా. విడుదల తేదీ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత హైప్‌ను పెంచుతుంది. అయితే ఈ చిత్రం విడుదలకు రైడ్ సిద్ధంగా ఉందని తెలిపారు చిత్ర బృందం.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా అలియా భట్ అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ హీరోయిన్ ఒలివీయా మోర్రీస్ నటిస్తుంది. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Witness the unstoppable force of fire and water on October 13, 2021. #RRRMovie #RRRFestivalOnOct13th@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @thondankani @RRRMovie @DVVMovies pic.twitter.com/NCIHHXQ8Im
— rajamouli ss (@ssrajamouli) January 25, 2021