కరోనా సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు అని అడిగితే ఆలోచించకుండా చెప్పే సమాధానం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అన్ని రకాల సినిమాలు తీస్తారు అని ఈ లాక్ డౌన్ సమయంలో మరో సారి చూపించారు.
ఇప్పుడు ఎవరో బయోపిక్ తీయడం కన్న తన బయోపిక్ తీయడంలో కిక్ ఉంటుందని అతని జీవితాన్నే బయోపిక్ గా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అతని జీవితం చరిత్రను మూడు భాగాలుగా చేయనున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. 3 భాగాలలో ప్రతి భాగం 2 గంటల నిడివి ఉండేటట్లు తీస్తున్నారు. ప్రతి భాగంలో వర్మ యొక్క జీవితంలోని వివిధ దశలను ప్రదర్శిస్తుంది.
పార్ట్ 1 లో ఆర్జివి యొక్క కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారు అనేది ఉంటుందని అంటున్నారు. అలాగే పార్ట్ 2 ముంబై అండర్ వరల్డ్ తో తన జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి ఉంటుందని అంటున్నారు. ఇంకా పార్ట్ 3లో ఆర్జివి యొక్క ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల ఆయనకు ఉన్న విపరీత వైఖరుల గురించి ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రానికి బొమ్మాకు మురళి నిర్మాణంలో ఆర్జివి ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు . ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పార్ట్ 1 లో ఆర్జివి 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. అలాగే పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో మాత్రం రామ్ గోపాల్ వర్మ నటించబోతున్నారు. ఆర్జివి బయోపిక్ లో స్వయంగా ఆర్జివినే పార్ట్ త్రీలో ప్లే చేయడం చాలా ఆసక్తి నెలకొంది ఈ చిత్రంపై. రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
BOMMAKU CREATIONS production house is all set to produce a 3 part biopic film on my life ..it will be very very controversial
బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ , నా నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. pic.twitter.com/UYDEEjLmTe
— Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2020
Each part of the 3 parts of my biopic will be around 2 hours in length with all 3 parts together being around 6 hours #RgvBiopic
నా బయోపిక్ 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది అంటే 3 చిత్రాలు కలిపి 6 గంటలు. pic.twitter.com/9CsWXvSQ4D
— Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2020