లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చాలా మంది సినీ ప్రియులకు సినీ కార్మికులకు కొంత ఊరట లభించింది. దాదాపు ఏడు నెలల తరువాత, అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లు, సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్‌లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 5.0 ను కేంద్రం ఈ రోజు ప్రకటించింది. స్క్రీన్ ఆక్యుపెన్సీ యొక్క 50% సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు . కరోనావైరస్ కేసులు అధికంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం ప్రజలకు మరింత సడలింపులను జారీ చేసింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మూవీ ప్రదర్శన పూర్తయిన తర్వాత అన్ని తెరలను శుభ్రపరచాలి మరియు సామాజిక దూర మార్గదర్శకాలను పాటించాలి. వినోద ఉద్యానవనాలు, ఈత కొలనులు మరియు ఇతర సారూప్య ప్రదేశాలను కూడా తెరవడానికి అనుమతించవచ్చు. టాలీవుడ్ ఎగ్జిబిటర్లు ఇప్పుడు థియేటర్లను తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్లు నవంబర్ మొదటి వారం నుండి తిరిగి తెరవబడతాయి, అయితే ప్రముఖ హీరో సినిమాలు క్రిస్మస్ మరియు దసర నుండి విడుదల కావడం ప్రారంభమవుతాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పెద్ద హీరోల అభిమానులకు కొద్దిగా ఊరట లభించింది అనే చెప్పుకోవాలి ఎందుకంటే వారి అభిమాన హీరోను పెద్ద స్క్రీన్ మీద చూడటానికి చాలా మంది ఇష్టపడతారు.
Official statement from Multiplex Association of India about reopening of Cinemas across the country from October 15, 2020 pic.twitter.com/X2DD7FkSHt
— BARaju (@baraju_SuperHit) September 30, 2020