Friday 27th of December 2024

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పండుగ రోజు

ఎప్పుడుఎప్పుడా అని ఎదురు చూసిన పవన్ అభిమానులు పండగ రానే వచ్చింది. సెప్టెంబర్ 2 ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన భారతీయ చలన చిత్రరంగంలో అతికొద్ది మంది సూపర్ స్టార్లలో పవన్ ఒకరు, ఆయనకు బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా భారీ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావాలంటే పవర్ స్టార్ అనే పేరు పోస్టర్ మీద ఉంటే చాలు. అందుకే నిర్మాతలు అతనితో మూవీ తీయడానికి క్యూ కడుతున్నారు. తన రాజకీయ కట్టుబాట్లను కొనసాగించడానికి రెండేళ్ల విరామం తీసుకున్న తరువాత, ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమాలోకి పునఃప్రవేశం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ యొక్క తెలుగు రీమేక్ అయిన వకీల్ సాబ్ తో పవర్ స్టార్ వెండితెరపైకి తిరిగి వస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోని కపూర్ అలాగే దిల్ రాజు కలిసి తీస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ రోజు ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ కానీ టీజర్ కానీ విడుదల చేస్తున్నారు. అలాగే బహుముఖ చిత్రనిర్మాత క్రిష్ జగర్లాముడితో కలిసి పాన్-ఇండియన్ ప్రాజెక్టుపై సంతకం చేశారు. గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తిరుగు ఇప్పుడు మళ్లీ మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఈ రోజు #pspk28 నుంచి అప్డేట్ ను విడుదల చేయబోతున్నారు ఈ మూవీ మేకర్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా
పవన్ అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండింగ్ అనేది సృష్టించారు కానీ అనుకోని సంఘటన జరిగింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ అభిమానులు బ్యానర్లు కడుతుండగా కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మరణించారు. అలాగే నలుగురుకీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ట్రెండింగ్ అనేది ఆపివేయాలని నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అలాగే అభిమానులు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ అభిమానులు విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి.

మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ సార్.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us