పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొద్ది నెలల్లో తన పుట్టిన రోజు వేడుక రాబోతున్న తరుణంలో సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును సెప్టెంబర్ 2 న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక వేడుకకి ఇంకో 2 నెలల సమయం మిగిలి ఉన్నప్పటికీ, డై-హార్డ్ అభిమానులు ఇప్పటికే వేడుకల్లో ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు
ఆల్ టైమ్ రికార్డ్ ఇంప్రెషన్స్‌తో సోషల్ మీడియాను సంచలనం చేస్తూ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు #AdvanceHBDpawankalyan అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకువచ్చారు. పవన్‌ని ఆరాధించే ప్రముఖులు కూడా ఈ ట్రెండ్ చేసారు. పవన్ యొక్క నినాదాన్ని ప్రతిబింబించే సంస్కృత కోసం… సమాజం కోసం అనే శీర్షికతో ఈ ప్రయోజనం కోసం ప్రత్యేక వీడియోను అలాగే పోస్టర్ రూపొందించబడింది. చూడాలి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా సెప్టెంబర్ 2న ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
సాంస్కృతిక పునరుత్తేజం
సమాజ హితం
సామాన్యుడి సంక్షేమంసేనాని అభిమతం 🙏#AdvanceHBDPawanKalyan pic.twitter.com/Dvvg8sMTjw
— Trend PSPK (@TrendPSPK) July 13, 2020