తెలుగు సినీ అభిమానులకు సినిమా అంటే తెర మీద కనిపించే బొమ్మలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఈలలు, కేరింతలుఉంటేనే వినోదం సంపూర్ణం. ఇళ్లలో చిన్నతెరల మీదే సినిమాలు చూసినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. శుక్రవారం అనగా ఈ రోజు విడుదలైన ఉప్పెన మూవీ కోసం కాకినాడ థియేటర్లు హౌజ్ ఫుల్ల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉప్పెన షూటింగ్ ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తియ్యడం వల్ల అక్కడి ప్రజలు అక్కడి అందాలను పెద్ద తెరపై ఆస్వాదించేందుకు బారులు తీరారు. దీంతో తొలి రోజు అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీఫ్లెక్సులు రద్దీగా కనిపించాయి. మరోవైపు ఉప్పెన మూవీ రివ్యూస్ బాగా రావడంతో బాక్సాఫీసు వద్ద బారులు తీరుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే నాలుగు షోలూ హౌస్‌ఫుల్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కిటకిటలాడాయి. వచ్చే రెండురోజులు శెలవు దినాలు కావడంతో ముందే ఆన్‌లైన్‌లో టిక్కెట్లన్నీ అమ్ముడుపోతున్నాయి.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌లో ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడి తొలి సినిమా కావడంతో. వైష్ణవ్ తేజ్ చిత్రం పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ప్రతినాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి సినిమాకి మరింత హైప్ తీసుకుని రాగా. హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్‌ప్రెషన్స్ కూడా సినిమాకు ప్రధానమైన బలంగా మారాయి. ఆమె క్యూట్ లుక్స్, పెర్ఫామెన్స్ యూత్‌ని మైమరపించేట్టుగానే ఉన్నాయి ఈ చిత్రంలో ఆమె నటన చూడటానికి రెండో సారి బాక్సాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు అక్కడి యువత. ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్,దర్శకుడు బుచ్చి బాబు ఈ చిత్ర విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.