మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ మంగళం శ్రీను పాత్రకు ఆయన న్యాయం చేశాడు. అలాగే ముఠా నాయకుడు కొండారెడ్డి నటించిన అజయ్ ఘోష్ పాత్ర కూడా బాగుంది. అలాగే సమంతా సాంగ్ మూవీ కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా అనిపించింది. కొంత మోతాదుకు మించి తన గ్లామర్ చూపించింది. మూవీ చివర్లో వచ్చిన మలయాళం నటుడు భన్వర్ సింగ్ షెఖావత్ పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఓవరాల్ గా చుస్తే పుష్ప పార్ట్ వన్ మాత్రం తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా అయితే మాత్రం ఉంది.