చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి తీసుకున్న ఫోటో ఏదైనా సరే వైరల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం చిరంజీవి తన కుటుంబంతో తీసుకున్న ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవి, సోదరీమణులు విజయ దుర్గా అలాగే మాధవి రావు మరియు సోదరులు నాగ బాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి తీసుకున్న ఫోటోతో విలువైన క్షణం అని ఈ ఉదయం చిరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. లాక్డౌన్ ప్రారంభమయ్యే ముందు ఆదివారం నాడు కలిసినప్పుడు ఈ ఫోటో తీసినట్లు చిరు చెప్పారు.
ప్రస్తుతం చిరంజీవి తన ప్రియమైన వారిని కలవడం లేదని, ఈ విపత్కర సమయాల్లో చాలా మంది కూడా అదే అనుభూతిని పంచుకుంటున్నారని ఆయన చెప్పారు. మంచి రోజులు మనందరికీ తిరిగి వస్తాయని ఆశిస్తున్నాము … త్వరలో, అని చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ భోజనం చేస్తున్నాడు, మెగా తోబుట్టువులందరూ దగ్గరగా కూర్చొని వారి తల్లి అంజనా దేవి కెమెరాకు పోజు ఇస్తున్నారు.