నిన్న ఒక సిని కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో ఒక యువ డాక్టర్ ని భయంకరమైన సామూహిక అత్యాచారం చేసి హత్య చేసారు ఈ విషయం గురించి సుకుమార్ మాట్లాడుతూ . ఈ సమాజంలో మగవాడిగా ఉన్నందుకు చాల బాధగా ఉన్నాది అని సుకుమార్ తన ప్రసంగంలో విచారం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ హృదయ విదారకంగా మార్చివేసింది. అయితే ఆ రోజు రాత్రి ప్రియంకా అపరిచితుల సహాయం కోరే బదులు 100 డయల్ చేసి ఉండాలని కొందరు అంటున్నారు. కానీ ఆమె చివరి ఫోన్ కాల్ విన్న తరువాత, ఆ నలుగురు నిజంగా ఆమెకు సహాయం చేయడానికి వచ్చి ఉంటారనే ఆమె నమ్ముతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి స్త్రీ పురుషుడిని ఎప్పుడూ నమ్మవద్దని నేను కోరుతున్నాను. మన మగవాడిలో కూడా జంతువులు వున్నారు అని . దయచేసి మమ్మల్ని నమ్మవద్దు. నేరస్థులు మనలోనే పుట్టారు, దానికి మనమంతా బాధ్యత వహిస్తాం ”అని సుకుమార్ అన్నారు.