అందరు ప్రభాస్ 21వ మూవీలో నటించబోయే హీరోయిన్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ ఈ రోజు తో ముగిసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించనున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు. తెలుగులో దీపికా పదుకొనే తొలిసారిగా ప్రభాస్ 21 పక్కన కధానాయికగా నటించడం ఇదే తొలిసారి కావడం ఈ చిత్రం గురించి బారి అంచనాలే నెలకొన్నాయి. పెద్ద తెరపై సూపర్ స్టార్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని చూడటానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన నటులు అలాగే టెక్నీషియన్స్ గురించి తొందర్లోనే తెలియజేస్తారు అని సమాచారం.