పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్ . థమన్ స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు చాలా చక్కగా రాసిన ఈ పాటను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ ఉదయం 11:16 గంటలకు విడుదల చేసారు. ఈ పాట అవుట్ అండ్ అవుట్ మాస్ నంబర్ సాంగ్ లాగా ఉంది. పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ పాట కారణం కానుంది.
ఇందులో యంగ్ బ్యూటీస్ నిత్యా మీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ యాక్షన్ డ్రామా, అయ్యప్పనుమ్ కోషియం యొక్క అధికారిక రీమేక్, భీమ్లా నాయక్, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు రాశారు.