మనిషి పోలిన వ్యక్తులు ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ వుంటే. అదే మనకి నచ్చిన నటి నటుల పోలిక ఉంటే అరే ఈమె అచ్చం ఆ హీరోయిన్ లాగా హీరో లాగా ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతాం. అయితే ఇప్పుడు ఇదీ అంతా ఎందుకంటారా ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అమాంతం నచ్చిన హీరోయిన్ నటి కృతి శెట్టి. ప్రస్తుతం ఈ నటి కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాని సినిమా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటిస్తోంది. అయితే అచ్చం కృతి శెట్టి నీ పోలిన ఒక అమ్మాయి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. తన పేరు కాత్యాయని జగన తను చేసే రీల్స్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ లో. ఉప్పెన చిత్రంలోని ఒక డైలాగ్ తో చేసిన వీడియో 7 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.ఆ వీడియో నచ్చి చాలా మంది అబ్బాయిలు డ్యూయల్ వీడియో చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 201 కె ఫాలోవర్స్ తో ఉన్నారు ఈమె. ఒక్కసారి మీరు కూడా చూసేయండి.