లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన నితిన్ షాలిని పెళ్లి ఎట్టకేలకు నిన్న అనుకున్న ముహూర్తానికి నటుడు నితిన్ రెడ్డి ఆదివారం తన కాబోయే భార్య షాలిని కందుకూరిని హైదరాబాద్ తాజ్ ఫలుక్నామా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. నితిన్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నయి నితిన్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తు ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిన్న రాత్రి వివాహ తక్కువ మంది అతిథులతో నితిన్ షాలిని దగ్గరి కుటుంబికులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు నితిన్ షాలిని జంట ఇంతకుముందు ఏప్రిల్‌లో వివాహం చేసుకోవలసి ఉంది, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి వారి వివాహంలో అంగరంగ వైభవంగా జరిగింది. అద్భుత దుస్తులలో వీరిద్దరూ ఫొటోలో చూడ ముచ్చటగా ఉన్నారు ఈ దంపతులు. నితిన్ ట్విట్టర్ వేదికగా తన పెళ్లి ఫోటోలు పెట్టీ మొత్తానికి ఒక ఇంటి వాడిని అయ్యాను.మీ దీవెనలు కావాలి అంటూ పోస్ట్ పెట్టారు హీరో నితిన్.
Mothaniki oka INTIVAADINI ayyanuu..😀😀 need all ur blessings n love 🙏🙏 pic.twitter.com/rWUNFDHZ5O
— nithiin (@actor_nithiin) July 26, 2020