సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడానికి వస్తున్నాయి. ఈ సారి ఎక్కువ పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ నుంచి రావడం శుభ పరిణామమని కొని ఆడుతున్నారు సినీ క్రిటిక్స్. ఈ సంవత్సరంలో 6 పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ ఇండియన్ చిత్రాలు విడుదల కావడం ఇదే మొదటి సారి.
మొట్ట మొదటి గా విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు లేటెస్ట్ మూవీ మేజర్ రిలీజ్ జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెండోవ చిత్రంగా వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం యాష్ హీరోగా జూలై 16న 2021 ‘కె.జి.యఫ్ 2’ విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ‘అధీరా’, రవీనా టాండన్ ‘రమికా సేన్’ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.
మూడవ చిత్రమ్ గా వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం రాధే శ్యామ్ ప్రభాస్ హీరోగా 140 కోట్ల బడ్జెట్‌తో గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న 2021 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నాల్గవ చిత్రంగా వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమాను ఆగస్ట్ 13న 2021 విడుదల కానుంది.
ఐదవ చిత్రంగా వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 9న 2021 విడుదల కానుంది . ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆరవ చిత్రంగా వస్తున్న మరో పాన్ ఇండియన్ చిత్రం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నా ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నా ఈ సినిమా అక్టోబర్ 13న 2021 విడుదల కానుంది.
ఈ ఆరు చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.