కొన్ని నెలల క్రితం, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ క్రింద పాన్-ఇండియన్ ప్రాజెక్టుపై సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తారని , ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో కలిసి మాఫియా థ్రిల్లర్ చేయడానికి యోచిస్తున్నాడు అని సమాచారం.ఇదే నిజమైతే ప్రశాంత్ నీల్ ప్రభాస్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి ఇదే నిజమైతే మరో కెజిఎఫ్ లాంటి విజయం కాయం.