నిహారికా చైతన్యల నిశ్చితార్థం నిన్న హైదరాబాద్ లో సన్నిహితులు మధ్య జరిగింది. ఈ నిశ్చితార్థం ఫోటోలు నిన్న రాత్రి నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాంచరణ్ అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు దూరమయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంపై ఒక క్లారిటీ అనేది వచ్చింది.కుటుంబంతో ఏదైనా సమస్య ఉందా అనే దానిపై సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి అయితే. పవన్ కళ్యాణ్ ప్రత్యేక దీక్షలో ఉన్నందున, అతను సాయంత్రం 6 గంటల తర్వాత తన ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు అని సమాచారం. అందువల్ల అతను ఫంక్షన్కు వెళ్లలేదని తెలుస్తుంది.