అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మూడు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన తదుపరి చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతి 2021 కి తెరపైకి రానుంది.
ఈ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోయే అతని తదుపరి చిత్రం 45 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించబడుతుందని సమాచారం.
అలాగే డైరెక్టర్ క్రిష్ యొక్క ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి రెడీగా ఉందని ఊహాగనులు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు అని త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది అని సమాచారం. అఖిల్ ఈ చిత్రంలో తన పాత్ర కోసం బాడీ ని ఫిట్ గ ఉంచడానికి గాను జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తుంది.