Friday 13th of March 2026

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలాసానితో చిత్ర నిర్మాతల మండలి బేటి

గడిచిన గత 6 వారాలుగా, కరోనావైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం అదేవిధంగా లాక్డౌన్ కారణంగా మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా అస్థిర స్థితిలో ఉంది. అయితే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని పలువురు ముఖ్య సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్‌కు సుదీర్ఘ అభ్యర్థనల జాబితాను సమర్పించారు.

పరిమిత సిబ్బందితో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వమని మొట్టమొదటి అభ్యర్థనగా కోరారు. లాక్డౌన్ కారణంగా నిర్మాతలకు భారీగా నష్టాలు ఎదురైన నేపథ్యంలో, జీఎస్టీ వసూళ్లను కనీసం ఒక సంవత్సరం పాటు నిలిపివేయాలని, లాక్డౌన్ కాలానికి సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని టిఎఫ్‌పిసి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

అలాగే, సింగిల్ విండో వ్యవస్థ యొక్క దీర్ఘకాల డిమాండ్, ప్రభుత్వ పార్కులు మరియు చారిత్రక ప్రదేశాలలో ఉచితంగా షూటింగ్ తీసుకోవటానికి అనుమతి, తప్పనిసరి పోలీసు అనుమతి లేకుండా ప్రైవేట్ ఇళ్లలో షూట్ చేసుకోవటానికి, మినీ థియేటర్లను ఏర్పాటు చేయడానికి అనుమతి అమలు చేయాలని టిఎఫ్‌పిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. చిన్న బడ్జెట్ చిత్రాలకు సహాయం చేయమని కోరారు.

తక్కువ బడ్జెట్ చిత్రాలను ప్రదర్శించడానికి ఐదవ షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, సంవత్సరంలో 12 వారాల పాటు తక్కువ బడ్జెట్ చిత్రాలను తప్పనిసరిగా ప్రదర్శించడానికి టిఎఫ్‌పిసి మంత్రిని కోరింది. చివరగా, అధిక మరియు మధ్య బడ్జెట్ సినిమాలకు అనువైన టికెట్ రేట్ల అనుమతి మరియు టికెట్ అమ్మకాలలో పారదర్శకతను ప్రారంభించడానికి ఒక వ్యవస్థను తీసుకురావడం ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించిన ముఖ్య అభ్యర్థనలు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us