రానా దగ్గుబాటి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని…
రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, హైదరాబాద్‌లో విద్య పూర్తయిన తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు, తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హీరోగా, మంచి నటుడిగా సినీ ప్రేక్షకులకు రానా సుపరిచితం. కానీ ఆయన చదువు పూర్తి కాగానే సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించలేదు. తొలుత విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. స్పిరిట్ మీడియా పేరుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. దీంతో జాతీయస్థాయిలో అవార్డు గెలుచుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి నేడు 36 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా రానాకి కి అభిమానులు, టాలీవుడ్ లోని ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే రానాకు కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రీసెంట్ గా రానా తో దిగిన ఫోటో లేకపోవడంతో ఎప్పుడో ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫొటోను షేర్ చేసారు అల్లు అర్జున్.
Happy Birthday Fireeeeeee 🔥 Btw … couldn’t find a pic of us in recent times . I can’t post the old ones 😂😉 @RanaDaggubati #HBDranadaggubati #bestie pic.twitter.com/R6i8KvUPjU
— Allu Arjun (@alluarjun) December 13, 2020