సోనుసూద్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వినిపిస్తున్న బ్రాండ్ నేమ్ కోవిడ్ సంక్షోభ సమయంలో తను చేస్తున్న సహాయానికి ఇప్పుడు రియల్ హీరో హోదాను పొందాడు మన సోనుసూద్. ప్రస్తుతం అతను చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్యలో పని చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే తాజా గా ప్రముఖ మీడియా ఛానల్ సంభాషణలో సోనుసూద్ మాట్లాడుతూ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు ఇటీవలి ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంక్‌లపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారని నాకు తెలుసు దీని ద్వారా వారు కోవిడ్ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు ఇది నిజంగా ప్రశంసించవలసిన విషయం ఇటువంటి మంచి పని చేస్తున్న వారికి నేను వారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న సోను సూద్ ను కలవడానికి చాలా మంది అభిమానులు తన ఇంటికి వెళుతున్నారు తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.