ప్రముఖ తెలుగు గాయని సునీత డిసెంబర్ ప్రారంభంలో తన చిరకాల ప్రియుడు రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం జనవరి 9 న జరగాల్సి ఉంది. ఈ రోజు, సునీత తిరుమలను సందర్శించి, స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేసి, తన పెళ్లికి ముందే భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు. తన పర్యటన తర్వాత మీడియాతో సంభాషించిన సునీత, తను రామ్ ను జనవరి 9 న పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా ముందు తెలియజేశారు. ఈ జంట ఇటీవల స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల కోసం భారీ పార్టీని జరిపిన విషయం తెలిసిందే.