టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత గురించి గత కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది అని తెలుస్తుంది. సింగర్ సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నార. ఈ రోజు ఒక ప్రైవేట్ వేడుకలో ఒక పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సునీత తన భర్త నుండి విడిపోయి గత కొన్నేళ్లుగా ఒంటరిగా పిల్లలతో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె ఒక మీడియా హౌస్ ఛైర్మన్‌తో నిశ్చితార్థం చేసుకుంది అని సమాచారం. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. సునీత సింగర్ గా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకుంది మరియు ఆమె తన కెరీర్లో వివిధ భారతీయ భాషలలో 1000 పాటలు పైగా పాడింది. 110 మంది నటీమణులకు ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చింది.