స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ ప్రస్తుతం గమనం అనే చిత్రంలో నటిస్తోంది. నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ అలాగే హీరో శివ కందుకూరి నటించిన ఈ చిత్రాన్ని పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇది నాలుగు దక్షిణాది భారత భాషలలో అలాగే హిందీలో విడుదల అవుతుంది. ఈ రోజు శ్రీయా పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు క్రిష్ ఈ ఉదయం గమనం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో శ్రియా డి-గ్లాం లుక్‌లో చాలా అందంగా కనిపించింది. క్రిష్ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ ఈ చిత్రాన్ని రమేష్ కరుటూరి మరియు వెంకి పుషాదపు సహకారంతో నిర్మిస్తున్నారు. తొలి సారిగా సుజన రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మాస్ట్రో ఇలయరాజా సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేయగా, రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
FIRST LOOK… On #ShriyaSaran‘s birthday today, Team #Gamanam unveil the first look of the film, which will be released in five languages: #Telugu, #Tamil, #Kannada, #Malayalam and #Hindi… Directed by Sujana Rao… Filming complete… Post-production in progress. pic.twitter.com/5it6BatoSR
— taran adarsh (@taran_adarsh) September 11, 2020