హీరో శర్వానంద్ త్వరలో ప్రారంభించబోయే కొత్త చిత్రం ప్రేమతో కూడుకున్న యాక్షన్ డ్రామా సినిమా మహా సముద్రం ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర చాలా బాగా ఉంటుందని ఇది అతని కెరీర్లో మరపురాని చిత్రాలలో ఒకటిగా ఉంటుందని సమాచారం అలాగే మిగతా తారాగణం గురించి మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే బయట నటుడు సిద్ధార్థ్, బాలీవుడ్ నటి అదితి రావు హైడారి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తారని పుకారు ఉంది.
ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రం మహాసముద్రం తెలుగు-తమిళ ద్విభాషాలో విడుదల ఉంటుందని ఖచ్చితంగా మీ అంచనాలను చేరుకుంటుందని హామీ ఇచ్చారు అలాగే మరో అప్డేట్ వచ్చే సోమవారం ఉంటుందని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
My next movie will be a Telugu-Tamil bilingual Titled as #MahaSamudram
⭐ing @ImSharwanand, @AnilSunkara1 garu is producing it under @AKentsOfficial. It’s an Intense Love-Action Drama like never before & it will surely reach your expectations.
Another BIG UPDATE, next Monday 🔥
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 7, 2020