సంక్రాంతి రేస్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పండగ చిత్రంగా నిలిచింది. మాస్ మహా రాజ రవి తేజ శ్రుతి హాసన్ మరోక సారి హిట్ ఫెయిర్ గా నిలిచారు.
క్రాక్ విజయవంతమైన చిత్రాల్లో మొదటిగా నిలిచింది, లాక్డౌన్ తరువాత బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఇది నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గోపీచంద్ మలినేనిని స్వయంగా పిలిచి మరీ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విడుదలకు ముందు తను పడ్డ టెంక్షన్ అంత ఇంత కాదు అని గోపిచంద్ మలినేని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు తన చిత్రాన్ని థియేటర్ లో చూసి తన టెంక్షన్ మొత్తం పోగొట్టారు అని తెలిపారు. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్టుకు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్‌తో ఇప్పటికే సంతకం చేశారు అని సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరో నటించనున్నారు అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.