దాదాపు 8 నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజు హాలీవుడ్ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ యొక్క టెనెట్ చిత్రం విడుదలకు తెలంగాణ అంతటా అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు తిరిగి తెరవబడ్డాయి. ఈ రోజు మెగా హీరో సాయి ధరం తేజ్ కూడా ఈ చిత్రాన్ని పెద్ద తెరపై ఆస్వాదించడానికి ప్రసాద్స్ ఐమాక్స్ వైపు వెళ్లారు. టెనెట్ మూవీ చూడటానికి ప్రసాద్ ఐమాక్స్ వెళ్తున్న వీడియోను ట్వీట్ చేశాడు హీరో సాయి ధరమ్ తేజ్. చాలా కాలం తర్వాత తిరిగి థియేటర్లోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. పెద్ద తెరపై సినిమా చూడటం నాకు వినోదం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మీలో చాలామందికి అదే అనిపిస్తుందని నాకు తెలుసు. ఈ రోజు నుండి సినిమాను మళ్లీ సందడిగా జరుపుకుందాం అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ #CelebratingCinema అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మళ్లీ తెరుచుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు సినీ ప్రియులు.లాక్ డౌన్ తర్వాత థియేటర్లో అడుగపెట్టిన మొట్ట మొదటి హీరో కూడా సాయి ధరమ్ తేజ్ కావడం మెగా అభిమానులు చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.
It feels good to be back at the theater after a long long time. Watching a movie on the big screen is the ultimate form of entertainment for me. I know many of you feel the same. Let’s celebrate cinema again in it’s finest form from today. #CelebratingCinema pic.twitter.com/hUylnVhYO6
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2020