ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత మార్చ్ నెల చరణ్ బర్త్ డే కానుకగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కీలక పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి డెడికేషన్ తో సినిమా కోసం వర్క్ చేశారో చూపించారు. అలాగే రాజమౌళి బర్త్ డే కు ఒక చిన్న వీడియోను టీమ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 22న విడుదల కాబోయే ఎన్టీఆర్ టీజర్ గురించి ఈ టీజర్ లో ఎన్టీఆర్ చూపించిన తీరు అబ్బురపరిచేలా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది అని సమాచారం ఇంతకు ముందెన్నడూ చూడని హై వోల్టేజ్ సీన్స్ ఇందులో చూస్తారని తెలుస్తుంది. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉంటుందని సమాచారం. ఎన్‌టిఆర్‌ను మునుపెన్నడూ లేని విధంగా ప్రదర్శించే ఈ డైలాగ్‌కు రామ్ చరణ్ వాయిస్‌ఓవర్ ఇవ్వనున్నారు. సినిమాలోని కీలక పాత్రలు అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.
ఈ నెల 22న టీజర్ విడుదల చేయబోతున్నట్టు ఇందులోనే ప్రకటించారు. మేకింగ్ వీడియోలోనే ఈ రేంజ్ లోనే ఉంటే ఇక టీజర్ ట్రైలర్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.