టాలీవుడ్ దర్శకుడు హాలీవుడ్ టాకింగ్ తీసే ఓకే ఒక దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డి’తో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ను తీయబోతున్నడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పోస్టర్ పై మిమ్స్ అయితే చేస్తున్నారు అభిమానులు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పోస్టర్ ను ప్రశాంత్ వర్మ తేజ సజ్జా ఇద్దరు కలిసి బైక్ మీద వెళుతున్నట్టు క్రియేట్ చేసారు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ హను–మాన్ క్రాస్ఓవర్ ఆర్ఆర్ఆర్ అంటూ పోస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. ఈ పోస్టర్ చూసిన అభిమానులు కామెంట్స్ రూపంలో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హను–మాన్ చిత్ర షూటింగ్ జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్.