మాస్ మహా రాజ రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.