ఈ కొవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన స్థితిలో ఉంది,ఈ కరోనా వ్యాప్తి దృశ్య ఈ లాక్ డౌన్ కూడా పెంచుకుంటూ వెళుతున్నారు, భారతదేశాన్ని ఆర్థికంగా ఆదుకోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.పిఎం గారు చేసిన ఈ ప్రకటన చాలా మంది ప్రశంసింస్తున్నారు.
గత కొద్ది కాలంగా బిజెపితో సన్నిహితంగా ఉంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ గారి పై ప్రశంసలు కురిపించారు. పవన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిన్న మోడీకి ధన్యవాదాలు తెలిపారు, ఈ ఆర్థిక ఉద్దీపన ద్వారా ఇండియా ఎదగడానికి ముందుకు నడిపించడానికి మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఆర్థిక ఉద్దీపన చారిత్రాత్మక సంస్కరణ అవుతుందని అన్నారు. 21 వ శతాబ్దం భారతదేశానిదే – భరత్ యొక్క ఆవిర్భావం అని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పవన్ బిజేపి కి మరింత సపోర్ట్ చేస్తూనట్లు తెలుస్తుంది.
Thank You Hon. PM Sri @narendramodi ji , Mission Self Reliant India – shall help our Nation to rise and lead the world. This fiscal stimulus shall be a historic reform and it begins from today. 21st Century shall belong to India – The Emergence of Bharat.🙏#AatmanirbharBharat
— Pawan Kalyan (@PawanKalyan) May 12, 2020