కొణిదెల నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదైవిలాస్ లో చైతన్య జోన్నలగడ్డతో అంగరంగగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన వధూవరులు వెంటనే హనీమూన్కు వెళ్లలేదు. వివాహానికి హాజరుకాని మిగిలిన కుటుంబ సభ్యులు స్నేహితులను కలవడానికి సమయం కేటాయించారు. మెగా ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న తరువాత, నిహారికా చైతన్య ఇద్దరూ హనీమూన్ కోసం అందమైన మాల్దీవులకు విమానంలో వెళ్లారు. లవ్బర్డ్లు ప్రస్తుతం గ్రాండ్ పార్క్ కోడిప్పారు హోటల్లో ఉంటున్నారు. వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో మనోహరమైన చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు ఎవరు పెళ్లి చేసుకున్న హనీమూన్ డెస్టినేషన్ కోసం మాల్దీవులు ఎంచుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లుతో పాటు మాల్దీవుల్లో హనీమూన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.