ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్ ఏమిటి అంటే స్టార్ హీరోస్ రవితేజ, రామ్ చరణ్‌ల కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తుంది. 2019 లో వచ్చిన సూపర్ హిట్ మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ కోసం ఈ ఇద్దరి స్టార్ హీరోలుతో తీయాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది. గత ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న చరణ్ దీనిని మలయాళం ఒరిజినల్లో మోలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం మాస్ మహారాజ్ ఉంటే బాగుంటుంది అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు సంవత్సరం, రామ్ చరణ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని తెలుగు రీమేక్‌ను చేయనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. అలాగే ఈ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు కొంతకాలం వార్తలు వచ్చాయి. కానీ అది కూడా వాస్తవం కాదు. ఇప్పుడు మళ్లీ రవితేజ-రామ్ చరణ్ కలయికలో వస్తునట్లు సిని వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే కానీ నిజమైతే బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలవటం కాయం.