ఈ రోజు ప్రపంచం మొత్తం మదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు. చిరు తల్లి అంజనా దేవితో పాటు అతని భార్య సురేఖా, సోదరుడు నాగా బాబు మరియు అతని భార్య పద్మ, పవన్ కళ్యాణ్ అలాగే సోదరీమణులు విజయ దుర్గా మరియు మాధవి ఉన్నారు.
ప్రపంచంలోని అన్ని తల్లులకు హ్యాపీ మదర్స్ డే అని చిరు ట్వీట్ చేశారు. మెగా కుటుంబం కలవడం గురించి ఒక్కప్పుడు తీసుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో అంజనా దేవి గారు ప్రత్యేక ఆకర్షణ ఉన్నారు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తుండగా అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
#HappyMothersDay to All the Mothers of the World!! pic.twitter.com/OPeY2uD9sY
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 9, 2021