మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ ని ప్రత్యేకంగా చూడటానికి ప్రతీ రోజూ అభిమానులు వస్తున్నారు అని సమాచారం. ఈ విషయాన్ని చిరంజీవి గారి మెగా అభిమాని అయిన ఒకరు సోషల్ మీడియా ట్విట్టర్లో తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. గతంలో వినేవాలం చిరంజీవి గారి కలవడానికి సాధారణ అభిమానులే కాదు, పెద్ద వ్యక్తిలు కూడా సామానుల పోటీ పడతారని కళ్లారా చూసాను అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.
కాకినాడ నుండి IAS, IPS వారి కుటుంబాలతో వచ్చారు.గతంలో వినేవాలం చిరంజీవి గారి కలవడానికి సాధారణ అభిమానులే కాదు, పెద్ద వ్యక్తిలు కూడా సామానుల పోటీ పడతారని కళ్లారా చూసాను.అక్కడ వచ్చిన 60 ఏళ్లు దాటిన వారు కూడా చిరంజీవి ఎప్పుడు వస్తారు వారి ఆతృత చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. pic.twitter.com/j2pP1VsK1H
— Bobby Yedida UNIKI 💥 (@bobby_yedida) March 5, 2021
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం మే 13న విడుదల కానుంది.