ప్రముఖ టాలివుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు హీరో శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా ఎమోషనల్ ఇన్ టెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం `మను చరిత్ర`. వాలెంటైన్ డే సందర్భంగా ఈ చిత్ర బృందం థీమ్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నటి కాజల్ అగర్వాల్ ఈ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మను చరిత్ర చిత్రం లాంఛనం సమయంలో ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. భరత్ కుమార్.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్ జోసెఫ్ గారు ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఆయనతో కలిసి ఎన్.శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Falling in Love is a Painful Joy💘
Isn’t it?😉
My Love to you guys❤️
Here’s the ThemePoster of #ManuCharitra🌟ing @iam_shiva9696 @akash_megha @PriyaVadlamani @Dhananjayaka @ActorSuhas
📣@S4bharat
🎶@GopiSundarOffl
🎥#RahulShrivatsav
💰#NSreenivasaReddy#RonnsonJoseph @AppleOffl pic.twitter.com/eA04zulxGO— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 14, 2021