ప్రస్తుతం ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం ఇప్పుడు కొంచెం బాగా ఉన్నట్లు సమాచారం. బాలు గారికి ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేదని తెలుస్తోంది. బాలు గారు కోలుకోవడం చూసి వైద్యులు చాలా సంతోషంగా ఉన్నారు అని సమాచారం. బాలు గారు ఇప్పటికీ ఐసియులోనే ఉన్నారు కానీ వెంటిలేటర్‌కు దూరంగా ఉన్నారు అని సమాచారం. అయితే బాలు గారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అభిమానులను అందరినీ బాలు గారి ఆరోగ్యం గురించి ప్రార్ధన చేయవలసిందిగా కోరారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మనందరం బాలుగారి ఆరోగ్యంకోసం ప్రార్ధన చేద్దాం అని రామజోగయ్య శాస్త్రి కూడా కోరారు.
కొన్ని రోజుల నుండి బాలు గారు చెన్నై హాస్పిటల్లో లైఫ్ సపోర్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం రోజురోజుకు మరింత బాగుపడటంతో, మనమందరం ఒక్కసారి ఆయన తొందరగా కోలుకుని రావాలని ప్రార్ధన చేద్దాం.
మా బోస్ గారి మాటే నా మాట కూడా …ఈరోజు సాయంత్రం 6 గంటలకు మనందరం బాలుగారి ఆరోగ్యంకోసం ప్రార్ధన చేద్దాం 🙏 https://t.co/zGMmCC1esK
— RamajogaiahSastry (@ramjowrites) August 18, 2020