కరోనా లాక్డౌన్ కారణంగా మాస్ హీరో రవితేజ క్రాక్ చిత్రం వాయిదాపడుతూ వస్తుంది. అందరు ఒటిటిలో విడుదల చేస్తారేమో అని ఊహాగానాలు వినిపించాయి, అయితే ఈ చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా థియేటర్లోనే విడుదల చేస్తామన్నారు. అయితే, తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే తిరిగి ప్రారంభమవుతుంది అని సమాచారం వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చెయ్యాలని భావిస్తోందట. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏమిటంటే, ఒకవేల కేంద్ర ప్రభుత్వం సినిమాల్లో ప్రొజెక్షన్ను అనుమతించినట్లయితే, ఈ చిత్రం దసరా పండుగ దగ్గర్లో విడుదల అవుతుంది అని టాక్. ఇదే కానీ నిజమైతే మాస్ మహారాజ అభిమానులకు పండగే పండగ అని చెప్పుకోవాలి.
గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రధాన కథానాయికగా నటించింది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.